News August 26, 2024

పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు: హోం మంత్రి

image

ఇకపై పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో కలిసి పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పరిశ్రమల భద్రతను గాలికి వదిలి వేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు

image

వాల్తేరు డివిజన్ నుంచి దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు, సికింద్రాబాద్, చెన్నై, అరకు, కొల్లాం తదితర ప్రాంతాలకు సుమారు 30 రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఇప్పటికే ఉన్న పలు రైళ్లకు స్లీపర్, జనరల్ బోగీలను కలపనున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేశామని, వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

News September 30, 2024

విశాఖ వేదికగా క్రికెట్ మ్యాచ్

image

రంజీ ట్రోఫీలో ఆడే ఆంధ్ర జట్టుకు రికీ బుయ్ మరోసారి నాయకత్వం వహించనున్నారు. వచ్చేనెల 11న తొలి మ్యాచ్‌లో విదర్బతో ఆంధ్ర జట్టు తలపడనుంది. 18న గుజరాత్‌తో, 26న హిమాచల్ ప్రదేశ్‌తో ఆంధ్ర జట్టు ఆడనుంది. విశాఖ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ జరగనుంది. విశాఖ ప్లేయర్ రికీ బుయ్ కెప్టెన్‌గా, షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

News September 30, 2024

స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎండీగా ఎంఓఐఎల్ ఛైర్మన్ అజిత్ కుమార్ సక్సెనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టీల్‌ప్లాంట్ నూతన సీఎండీగా ఎస్.శక్తిమణి ఇప్పటికే సెలెక్ట్ అయ్యారు. గత సీఎండీ అతుల్ భట్ ఉద్యోగ కాలం నవంబర్ నెలాఖరు వరకూ ఉంది. అంతవరకూ అజిత్ కుమార్ సక్సేనా సీఎండీగా వ్యవహరించనున్నారు.