News March 19, 2025

పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి: జేసీ

image

పరిశ్రమల్లో ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.

Similar News

News December 7, 2025

నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

image

నరసరావుపేటలో గత వారంతో పోలిస్తే ఈ ఆదివారం కేజీ చికెన్ ధర రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. లైవ్ కోడి కేజీ రూ. 135 ఉంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ రూ. 240-280 ఉండగా స్కిన్‌తో రూ. 230-260 లభిస్తుంది. మటన్ కేజీ ధర రూ. 800-900 అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్లు రూ. 670 అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

సంగారెడ్డి: బాబోయ్.. మళ్లీ చలి

image

ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ చలిపంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా కోహీర్ మండలంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట(D) అంగడికిష్టాపూర్‌లో 10.6 డిగ్రీలు, మెదక్(D) నార్లాపూర్‌లో 11.2 డిగ్రీలు నమోదయ్యాయి. చల్ల గాలుల ప్రభావంతో రానున్న పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

News December 7, 2025

భద్రకాళి అమ్మవారి నేటి దివ్య దర్శనం

image

వరంగల్ కొంగు బంగారమైన శ్రీ భద్రకాళి ఆలయంలో ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేషమైన అలంకరణ చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. నేడు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.