News July 9, 2024
పరిశ్రమల్లో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలి: కలెక్టర్
పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌వో గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 14, 2024
కడప: నేటినుంచి యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం
కడప జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఆరిఫ్ తెలియజేశారు. నగరంలోని కెనరా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సెల్ ఫోన్ రిపేరింగ్ -సర్వీసింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ విభాగాలలో శిక్షణ ఉంటుందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
News October 13, 2024
కడప జిల్లాలో లాటరీ’ కిక్కెవరికో?
రాష్ట్రంలో మద్యం షాపులను సోమవారం లాటరీ ద్వారా కేటాయిస్తారు. 3396 షాపులకు వేర్వేరుగా లాటరీలు తీస్తారు. ప్రతి దరఖాస్తుదారునికి ఒక నంబరు కేటాయించి, మాన్యువల్‌గా లాటరీ తీస్తారు. దీనికోసం కడప జిల్లాల్లో 139 మద్యం దుకాణాలకు లాటరీ కోసం కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 139 మద్యం దుకాణాల కోసం 3257 దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.
News October 13, 2024
చింతకొమ్మదిన్నె: బస్సులో నుంచి కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌లో నిలబడి ప్రయానిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కడప నుంచి పులివెందులకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మునీంద్రా అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం KSRM ఇంజనీరింగ్ కళాశాల వద్ద బస్సులో నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయం కాగా స్థానికులు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కి తరలించారు.