News December 28, 2024
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలి: కలెక్టర్
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం భీమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలు& ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న 47 పరిశ్రమలకు స్టాటిటరీ నోటీసులు ఇచ్చి, వాటికి సంబంధించిన రిపోర్టులను అందించాలన్నారు.
Similar News
News January 4, 2025
ప.గో: మంత్రి నాదెండ్లను కలిసిన దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు శాఖా పరమైన అంశాలు చర్చించినట్లు తెలిపారు.
News January 3, 2025
ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు
ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
News January 3, 2025
ఏలూరు: రేపటి నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు
శనివారం నుంచి ఏలూరు జిల్లాలో భోజన పథకం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం’ అనే పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రారంభం కాబోతున్నది. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థులు భోజనం చేయడానికి గిన్నెలు, గ్లాసులు, వంట పదార్థాలు సిద్ధం చేశామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ప్రభాకరరావు చెప్పారు. నారాయణపురం కాలేజీలో ఏర్పాట్లను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు.