News November 28, 2024
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలి: కలెక్టర్ చేతన్
శ్రీ సత్య సాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
Similar News
News November 28, 2024
అనంతపురంలో ఉరేసుకుని మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం మెడికల్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థి వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది తెలిపారు. రోహిత్ MBBS నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సొంత ఊరు ఉరవకొండ పట్టణమని స్నేహితులు తెలిపారు. కేసు నమోదు చేసి తలిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
News November 28, 2024
బూడిద వివాదం: జేసీ, ఆదిలకు సీఎం పిలుపు
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ సీఎం చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 27, 2024
అనంతపురం: ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎంపీ అంబికా
ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీయే ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పవన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సహచర పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.