News January 24, 2025
పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: విశాఖ కలెక్టర్

జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా సహకారం అందించాలని సూచించారు. భూ సేకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
Similar News
News January 7, 2026
విశాఖ: పరువు నష్టం దావా.. ఈనెల 21కి కేసు వాయిదా

తనపై ఓ పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా కేసులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఉదయం 11 గంటలకు కోర్టుకు రాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. చివరకు న్యాయమూర్తి ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
News January 7, 2026
రైల్వే జోన్ ఉద్యోగుల కేటాయింపుపై ముమ్మరంగా చర్యలు

సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం ముందడుగు వేసింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా చర్యలు జరుగుతున్నాయి. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు బదలాయింపు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ తర్వాత ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు.
News January 7, 2026
బెంగుళూరు ట్రైన్ ఎక్కి మిస్ అయిన విశాఖ వాసి

తెన్నేటి నగర్‌కు చెందిన సిమ్మ శ్రీను బాబు (48) వృత్తి రీత్యా బెంగళూరులో పని చేస్తున్నారు. డిసెంబర్ 16న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖకు బయలుదేరారు. అయితే మరుసటి రోజు అతను విశాఖ చేరుకోలేదు. తెలిసిన వారందరికీ అడిగినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు కంచరపాలెం పోలీసులు, బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.


