News December 27, 2024
పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతి: కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనుమతుల కోసం వచ్చిన 565 దరఖాస్తులలో 499 ఆమోదం పొందాయని చెప్పారు.
Similar News
News December 16, 2025
ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి?

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైనట్టు సమాచారం. ఇటీవల ఒంగోలులో జిల్లా అధ్యక్షుని ఎంపికపై పరిశీలకులు, నాయకుల అభిప్రాయాలను సేకరించారు. సామాజిక సమీకరణలతో పాటు వివిధ కోణాల్లో లోతుగా పరిశీలన చేసిన టీడీపీ అధిష్ఠానం ఉగ్రకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.
News December 16, 2025
వాట్సాప్ గవర్నెన్స్తో ప్రకాశం పోలీస్ మరింత ముందుకు!

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందే పోలీస్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు కోరారు. ప్రకాశం జిల్లా ఐటీ విభాగం పోలీసులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందే పోలీస్ సేవలపై ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ చలానా చెల్లింపులు, ఎఫ్ఐఆర్ డౌన్లోడ్, కేసుల స్థితిగతులను తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. అందరూ 9552300009 నంబర్ సేవ్ చేసి, HI అని మెసేజ్ చేయాలన్నారు.
News December 16, 2025
ప్రకాశం జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్ల వారీగా విభజించే క్రమంలో ప్రకాశం జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.


