News February 25, 2025

పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News October 25, 2025

కడప జిల్లాకు రెడ్ అలెర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో JC అదితి సింగ్, జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
కడప కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08562-246344
కడప ఆర్డీవో కార్యాలయం: 08562-295990
జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం: 95028 36762
బద్వేలు ఆర్డీవో కార్యాలయం: 6301432849
పులివెందుల ఆర్డీవో కార్యాలయం: 8919134718

News October 25, 2025

నగరంలో క్రైమ్ రేట్ తగ్గించాలి: సీపీ శంఖబ్రత బాగ్చి

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఈనెల రివ్యూ మీటింగ్‌లో పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. నగరంలో గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించాలని, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, క్రైమ్ రేటు తగ్గించేలా రాత్రి నిఘా పటిష్ఠం చేయాలని సూచించారు. మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 25, 2025

ఓటర్ జాబితాను పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలి: కలెక్టర్

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్ తో పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ ఆర్ వో, ఏఈఆర్‌వో, డిప్యూటీ తహశీల్దారులు, BLO, పంచాయతి కార్యదర్శులు, సూపర్వైజర్లతో రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.