News February 25, 2025

పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News July 6, 2025

సిరిసిల్ల: IIITకి 24 మంది విద్యార్థులు ఎంపిక

image

గంభీరావుపేట మండలంలో 24 మంది విద్యార్థులు బాసర IIITకి ఎంపికైనట్లు మండల విద్యాధికారి సంటి గంగారం తెలిపారు. మండలంలోని లింగన్నపేట, మల్లారెడ్డిపేట, సముద్ర లింగాపూర్, దమ్మన్నపేట, కొత్తపల్లి, గజ సింగవరం, ముచర్ల, నాగంపేట గ్రామాలకు చెందిన ZPHS విద్యార్థులు బాసర IIITలో సీట్లు సాధించారన్నారు. వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 6, 2025

అనకాపల్లి: యువతకు కువైట్‌లో ఉద్యోగ అవకాశాలు

image

అనకాపల్లి జిల్లాలో యువతకు కువైట్‌లోని నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్.గోవిందరావు శనివారం తెలిపారు. ఐటీఐ, డిప్లొమా చదివి సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, సీలింగ్ పనిలో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండి 25 నుంచి 50 ఏళ్ల వయసు గలవారు అర్హులుగా పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీలోగా www.naipunyam.apgov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News July 6, 2025

జగిత్యాల: రైతులకు ముఖ్య గమనిక

image

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకొని ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతులు తక్షణం మీ బ్యాంకులో, స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించాలన్నారు.