News February 15, 2025

ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకుందాం: కలెక్టర్

image

ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణంలో ప‌ని చేద్దామ‌ని స్వ‌చ్ఛ ఆంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంధిర ప్ర‌సాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌దర్శ‌కాల‌కు అనుగుణంగా ఫిబ్ర‌వ‌రి నెల 3వ శ‌నివారం జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, క‌ళాశాలలు, పాఠ‌శాల‌లు, ఇత‌ర‌ సంస్థ‌ల ప‌రిధిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నాట్లు ఆయన తెలిపారు.

Similar News

News March 26, 2025

విశాఖలో చిన్నారిపై అత్యాచారం

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన జరిగింది. వన్‌టౌన్ పరిధిలో ఓ చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని చంగల్రావ్ పేట ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కింద ఇంట్లో ఉంటున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. ఏసీపీ పెంటారావు దర్యాప్తు చేపట్టారు.

News March 26, 2025

ముఖ్యమంత్రి చేపట్టిన సదస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మూడో విడత కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా బుధవారం జరుగుతున్న సదస్సులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పీ -4 సర్వే, పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉన్నారు.

News March 26, 2025

గాజువాకలో యువకుడి సూసైడ్ 

image

గాజువాక మండలం B.C రోడ్డులోని వాంబేకాలనీలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న పవన్(21) ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే కారణంగా చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!