News February 20, 2026
పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 20, 2026
9 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు

రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద 8 మందికి ఆఫీస్ సబార్డినేట్, ఒకరికి జూనియర్ అసిస్టెంట్‌గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నియామక ఉత్తర్వులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్ఓ చిరంజీవి పాల్గొన్నారు.
News April 20, 2026
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం: కలెక్టర్ డా.సిరి

ఆపద సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ డా.సిరి కొనియాడారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కర్నూలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరికరాల ప్రదర్శనను ఆమె తిలకించారు. అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉంటూ ప్రాణ ఆస్తి నష్టాలను నివారించాలని కలెక్టర్ సూచించారు.
News April 20, 2026
కర్నూలు: కాలువలో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆరేళ్ల బాలిక రక్షిత మృతి చెందడం విషాదాన్ని నింపింది. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి అదృశ్యం కాగా, ఆదివారం గ్రామ సమీపంలోని LLC కాలువలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. తమ గారాల పట్టి మరణంతో తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


