News February 24, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News March 22, 2025
డీలిమిటేషన్ అమలైతే మనల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారు: CM రేవంత్

TG: డీలిమిటేషన్ విషయంలో BJPని అడ్డుకోవాలని CM రేవంత్ అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. ‘జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించదు. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. మనవద్దే అభివృద్ధి ఎక్కువ. అయినప్పటికీ నిధుల్లో వివక్ష చూపిస్తున్నారు. రూపాయి పన్ను కట్టే తెలంగాణకు 42 పైసలే ఇస్తున్నారు. కానీ బిహార్‌కు రూపాయికి రూ. ఆరు ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
కర్ణాటక యువకుడి ఆత్మహత్య

పరిగి మండల పరిధిలోని జయమంగళి నదీ పరిసరాల్లో కర్ణాటకకు చెందిన రాజేశ్ అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిబ్బంది కలిసి ఎస్ఐ రంగుడు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పురుగు మందు బాటిల్‌తో పాటు కూల్ డ్రింక్ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 22, 2025
10వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జనగామ కలెక్టర్

జనగామ పట్టణ కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. సహాయ సంచాలకులు రవి కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ శోభన్, సత్యనారాయణ తదితరులున్నారు.