News March 11, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ASF పీటీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శుద్ధమైన తాగునీరు, విద్యుత్, వెలుతురు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
Similar News
News December 22, 2025
సిద్దిపేట: చలి బాబోయ్ చలి.. మంట కాచుకున్న కుక్కలు

చలి బాబోయ్ చలి అంటూ కుక్కలు చలి మంట కాచుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో మూడు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. సిద్దిపేట జిల్లా ఎన్సాన్‌పల్లిలో చలి నుంచి ఉప శమనం కోసం కొంతమంది యువకులు చలిమంటలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే చలికి వణుకుతున్న కుక్కలు మంటల దగ్గరకు వచ్చి కాచుకున్నాయి. దీంతో మూగజీవాలు చలికి ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
News December 22, 2025
HYD: 10th విద్యార్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్

10th విద్యార్థలకు ఇదే లాస్ట్ ఛాన్స్.. నామినల్ రోల్స్‌లో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవాలని నాంపల్లిలోని SSC బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశముందని బోర్డు డైరెక్టర్ పీవీ.శ్రీహరి తెలిపారు. తల్లిదండ్రులూ పాఠశాలలకు వెళ్లి పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులే ఇందుకు బాధ్యత వహించాలని ఆదేశించారు.
News December 22, 2025
నేడు ఐటీడీఏలో ‘గిరిజన దర్బార్’

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ.రాహుల్ తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఉదయం 10.30 గంటలకు దర్బార్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బాధితులు అందజేసే దరఖాస్తులను స్వీకరించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. విధులకు అధికారులు సకాలంలో హాజరుకావాలని స్పష్టం చేశారు.


