News March 21, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: గద్వాల కలెక్టర్

నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు సజావుగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 7,717 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ సదుపాయం ఉండాలన్నారు.
Similar News
News November 9, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800 కాగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250, లైవ్ కోడి కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో మాంసం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని విక్రయదారులు చెప్పారు.
News November 9, 2025
కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.
News November 9, 2025
కామారెడ్డి: నేటి నుంచి కాలభైరవ స్వామి ఉత్సవాలు

రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలోని కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రభు తెలిపారు. తొలి రోజు బద్ది పోచమ్మకు బోనాలు, సోమవారం లక్ష దీపార్చన, మంగళవారం డోలారోహణం, జన్మదినోత్సవం, బుధవారం రథోత్సవం, రక్షా యజ్ఞం, అగ్నిగుండాలు ఇతర పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఈవో పేర్కొన్నారు.


