News February 22, 2025

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం పదవ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. సూపరింటెండెంట్లు ప్రతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని, అక్కడ అన్ని వసతులను పరిశీలించాలని ఆదేశించారు.

Similar News

News April 11, 2026

KNR: మారిన అంగన్వాడీ కేంద్రాల పనివేళలు

image

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకైన భవనాల్లో గర్భిణులు, బాలింతలు, సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడి అమలుచేసింది. కరీంనగర్ జిల్లాలో 777 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తున్నారు. మే నెలలో పూర్తిస్థాయి వేసవి సెలవులు ప్రకటించడంతో చిన్నారులు, సిబ్బందికి ఉపశమనం లభించింది

News April 11, 2026

కరీంనగర్‌లో ఈనెల 16న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 16న కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతిరావు తెలిపారు. పలు ప్రైవేట్ సంస్థల్లో 17 పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులై, 30 ఏళ్లలోపు ఉన్నవారు సర్టిఫికెట్లతో కాశ్మీర్‌గడ్డలోని కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.

News April 10, 2026

హుజూరాబాద్: డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని సీఎస్‌కు వినతి

image

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. హుజూరాబాద్ మండలంలోని సిరిసపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.