News February 25, 2025
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్

ఇంటర్మీడియట్, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు బస్సులను ఆయా రూట్లలో నడపాలని సూచించారు.
Similar News
News November 19, 2025
మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 1,70,331 చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1,14,681 చీరలు జిల్లాకు చేరుకున్నాయని, మిగతా 55,650 చీరలు త్వరలోనే వస్తాయని వెల్లడించారు.
News November 19, 2025
కగార్ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ

కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్తో కలిసి ఆయన ఈ మేరకు తెలిపారు.
News November 19, 2025
PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.


