News March 14, 2026

పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

జంగేడు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం తనిఖీ చేశారు. పరీక్షా నిర్వహణ తీరు, కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షా హాళ్లను సందర్శించి, విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News April 13, 2026

‘ప్రజలు అందించే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి’

image

ప్రజలు అందించే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పీ.శ్రీజ, పీ.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పరిశీలన, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 13, 2026

గద్వాల్: చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం

image

గద్వాల్(M) వీరాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంతియాజ్(26) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోవా నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా పెంట్లవెల్లికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 13, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,180
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,966
* 10 గ్రాముల వెండి ధర రూ.2,440.