News March 26, 2025

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్‌ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు..

Similar News

News April 3, 2025

25,65,000 రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం: పొంగులేటి

image

ఖమ్మం: 25,65,000 మంది రైతన్నలకు 20 వేల 687 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు ₹500 బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. అటు గత వానాకాలం పంటకు దాదాపు 1700 కోట్ల రూపాయలు బోనస్ అందించామని తెలిపారు. సంవత్సరానికి సరిపడా సన్న రకం బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News April 3, 2025

అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

image

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట <<15975525>>పెద్దిరెడ్డిగూడెం <<>>పంచాయతీ టిడి బంజరలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) సజీవ దహనం అయ్యాడు. మరో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.

News April 3, 2025

ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్‌ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.

error: Content is protected !!