News March 21, 2025
పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రతీక్ జైన్

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ కేంద్రంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.
Similar News
News January 10, 2026
విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసిపోతాయి: సీఎం

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే 6 నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుందన్నారు. కొందరు అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి అసూయ చెందుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి.. అన్నీ కలిసిపోయి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా తయారవుతుందని ఓ కాలేజీ వార్షికోత్సవ సభలో వివరించారు.
News January 10, 2026
హైదరాబాద్‌లో ఈ సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్!

ఈ పండక్కి సిటీలో మామూలు హంగామా లేదు బాసూ. పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13-15 వరకు ‘కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్’ అదిరిపోనుంది. 19 దేశాల పతంగులు, 1200 రకాల పిండివంటలతో ఫుడ్ లవర్స్‌కు పండగే. అసలైన కిక్కు గచ్చిబౌలిలో 16, 17 తేదీల్లో జరిగే ‘మెగా డ్రోన్ షో’. ఆకాశంలో రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్ల విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. హైడ్రా పుణ్యమా అని పునరుజ్జీవం పొందిన చెరువుల దగ్గరా గాలిపటాల పండగ జరుగుతుంది.
News January 10, 2026
హనుమకొండ: రూ.7.85 లక్షల విలువైన బంగారం చోరీ

కేయూ పీఎస్ పరిధిలో పట్ట పగలే దొంగతనం జరిగింది. శివసాయి కాలనీలో తాళం వేసిన ఇంట్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.7.85 లక్షల విలువైన బంగారం దోచుకెళ్లినట్లు బాధితుడు గోపాల కృష్ణ తెలిపారు. తన అమ్మాయి కాలేజ్ ఫీజు కోసం దాచుకున్నట్లు చెప్పారు. కేయూ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని డిసీపీ, ఏసీపీ, సీసీఎస్ పోలీసులు పరిశీలించారు.


