News March 21, 2025
పరీక్షా కేంద్రాలను సందర్శించిన DEO

జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరీక్ష కేంద్రాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
Similar News
News July 9, 2025
HYD: 2023 ప్రతిభ పురస్కారాలు.. ఎంపికైంది వీరే

ఎలనాగ(కవిత), ప్రభల జానకి(విమర్శ), ఆర్.లక్ష్మీరెడ్డి(చిత్రలేఖనం), సంపత్ రెడ్డి(శిల్పం), రమేశ్ లాల్(నృత్యం), హరిప్రియ(సంగీతం), ప్రతాపరెడ్డి(పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ(నాటకం), పాపయ్య(జానపద కళ), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), మలయవాసిని(ఉత్తమ రచయిత్రి), శాంతి నారాయణ(నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. వీరికి 19న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
News July 9, 2025
వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News July 9, 2025
5 రోజుల్లో ‘తమ్ముడు’ షేర్ ఎంతంటే?

నితిన్ నటించిన ‘తమ్ముడు’ థియేటర్లలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విడుదలైన 5 రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రూ.75 కోట్లతో తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోగా 12శాతమే రికవరీ అయినట్లు తెలిపాయి. దారుణమైన డిజాస్టర్ అని అభివర్ణించాయి. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.