News March 6, 2025

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్, ఎస్పీ

image

నల్గొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులందరూ ఇంటర్ పరీక్షలు భయపడకుండా రాసి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలన్నారు.

Similar News

News December 22, 2025

చండూరు: కుమారుడి ప్రమాణస్వీకారం రోజే తండ్రి మృతి

image

చండూర్ మండలం తుమ్మలపల్లిలో విషాదం నెలకొంది. తన కుమారుడు రాజేశ్ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసే రోజే, మాజీ సర్పంచ్ సురేందర్ గుండెపోటుతో మృతిచెందారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సురేందర్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతోషంగా ఉండాల్సిన రోజున ఇలా జరగడం హృదయవిదారకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర శోకాన్ని నింపింది.

News December 22, 2025

అమెరికాలో నల్గొండ యువకుడి మృతి

image

నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసిన పవన్ ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. మిత్రులతో కలిసి పార్టీలో పాల్గొన్న అతను అకస్మాత్తుగా చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశముంది. ఉద్యోగానికి ఎంపికయ్యాడని, ఇంతలో ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

News December 22, 2025

నల్గొండ: పశువుల ఆస్పత్రిలోనే పంచాయతీ పాలన!

image

నిడమనూరు మండలంలోని పలు జీపీలకు సొంత భవనాలు లేక పాలన అద్దె గదుల్లోనే సాగుతోంది. నిడమనూరు మేజర్ పంచాయతీ భవన నిర్మాణం 11 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండటంతో, ప్రస్తుతం పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిధులు విడుదల చేసి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.