News November 12, 2024
పరీక్ష కేంద్రాలకు ముందుగానే రావాలి: NZB కలెక్టర్
ఆర్మూర్ మార్గంలో అడవి మామిడిపల్లి వద్ద ఆర్‌యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్‌యుూబీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో రాకపోకలు మళ్లించామన్నారు.
Similar News
News December 6, 2024
కౌలాస్‌కోటను సందర్శించిన సబ్ కలెక్టర్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కౌలాస్ కోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి రేపు (శనివారం) సందర్శించనున్న నేపథ్యంలో ఆమె కౌలాస్ కోటను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
News December 6, 2024
రేవంత్ ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలి: వేముల
ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించే సద్బుద్ధి ప్రసాదించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంబెడ్కర్‌కు నివాళి అర్పించి వేడుకున్నారు. హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణానికి వెళ్లి నివాళి అర్పించడానికి వీలు లేకుండా తమను హౌజ్ అరెస్ట్‌లు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
News December 6, 2024
NZB: బాలికపై లైంగిక దాడి.. ఇద్దరి రిమాండ్
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిని, అతడికి సహకరించిన మరొకరిని రిమాండ్‌కు తరలించినట్లు డిచ్పల్లి CI మల్లేశ్ తెలిపారు. అక్టోబర్ 1న జక్రాన్‌పల్లికి చెందిన యువకుడు ఓ బాలికను నమ్మించి నిర్మల్‌లోని వెంకటసాయి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 31న అజయ్‌ని అరెస్ట్ చేశారు. కాగా లాడ్జ్ మేనేజర్ సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.