News August 11, 2024
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదివారం రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన సర్వే ఎగ్జామ్ జరుగుతున్న తీరును పరీక్షా కేంద్రమైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు. ఈ పరీక్షకు అన్ని జిల్లాల నుంచి 1093కు గాను 943 మంది రెవెన్యూ ఉద్యోగులు సర్వే ఎగ్జామ్‌కు హాజరయ్యారైనట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 6, 2026
తెనాలిలో ఉద్రిక్త వాతావరణం

తెనాలి వహాబ్ చౌక్‌లో ఉద్రిక్తత నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా వహాబ్ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా ఫ్లెక్సీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
News January 6, 2026
GNT: ‘స్వీకారం’ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం

జిల్లాలో SC, ST, BC, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ‘స్వీకారం’ పేరుతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శ్రీకారం చుట్టారు. ప్రతీ వసతి గృహం ‘సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా’ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ వర్గాల సంస్థలతో తమీమ్ అన్సారియా మంగళవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
News January 6, 2026
GNT: నేడు సీఆర్డీఏ అథారిటీతో సీఎం సమావేశం

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.


