News March 5, 2025
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

సూర్యాపేటలోని పలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
గ్లోబల్ సమ్మిట్కు సినీ గ్లామర్

TG: ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి రోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తారు. 2వ రోజున మీడియా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంలో ‘పుష్ప’ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ పాల్గొంటారు. మరికొంతమంది కళాకారులు సమ్మిట్లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.
News December 2, 2025
ఖమ్మం: 20 ఏళ్ల కింద తోడికోడళ్లు.. ఇప్పుడు అన్నదమ్ములు

పెనుబల్లి మండలం యడ్లబంజరు గ్రామ పంచాయతీలో ఆసక్తికర రాజకీయ పోరు నెలకొంది. 20 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ గ్రామంలో, ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు రాజిన్ని అప్పయ్య, రాజిన్ని రాంబాబు సర్పంచ్ బరిలో నిలుస్తున్నారు. 2 దశాబ్దాల కిందట తోడికోడళ్లు పోటీ పడగా, రాంబాబు, ఆయన భార్య సునీత గతంలో 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఒకే కుటుంబం కావడంతో ఈ పోటీ అనివార్యమైంది.