News March 21, 2025

పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆదిలాబాద్ కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్, డీఈఓ ప్రణీత తదితరులు ఉన్నారు.

Similar News

News November 11, 2025

సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.

News November 10, 2025

ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

image

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.

News November 10, 2025

ఆదిలాబాద్: PGలో స్పాట్ అడ్మిషన్లు

image

ADB పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, పీజీ కోఆర్డినేటర్ డా. రాజ్ కుమార్ తెలిపారు. తుది విడత పీజీ అడ్మిషన్లలో బోటనీలో 40, జువాలజీలో 56 అడ్మిషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్‌లో సీటు వచ్చిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు.