News March 12, 2025
పరీక్ష జరిగి 2 నెలలు.. విడుదల కానీ ఫలితాలు

JNTU యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సంబంధించి రెండు, మూడో సంవత్సర విద్యార్థుల పరీక్షలు పూర్తయి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫలితాలను అధికారులు విడుదల చేయలేదు. ఫలితాలు విడుదల కాక విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ఫలితాలు విడుదల చేస్తారని కొండంత ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్న అధికారుల తీరులో మార్పు లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 23, 2025
రైతులకు భూమాత రక్షణ, మిశ్రమ పంటలపై అవగాహన కల్పించండి: కలెక్టర్

భూమాత రక్షణ కార్యక్రమం ద్వారా రైతులకు మిశ్రమ పంటల సాగు, ఎరువుల సమర్థ వినియోగంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎక్కువ రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న 100 గ్రామపంచాయతీలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సబ్ డివిజనల్, గ్రామస్థాయిల్లో భూమాత రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 23, 2025
రక్తదానంతో మరో ముగ్గురి ప్రాణాలు కాపాడొచ్చు: వరంగల్ సీపీ

రక్తదానం చేయడం ద్వారా మరో ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడగలమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని కాజీపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మడికొండలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీపీ ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, వ్యాపారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
News October 23, 2025
కృష్ణా: రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బాలాజీ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్లు, మండల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తహశీల్దార్లు, వీఆర్వోలు సర్వేయర్లతో కలిసి జిల్లాలో ఉన్న లేఔట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు.