News March 20, 2025
పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ సమస్య రానియద్దు: వరంగల్ సీపీ

రేపటి నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సైతం ముందస్తు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేందుకు పోలీసులు తమ వంతు సహకారాన్ని అందజేయాలని సూచించారు
Similar News
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
రాజన్న ఆలయంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రాజన్న ఆలయాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఆలయంలో ఇప్పటికే ఉన్న పలు కట్టడాలను తొలగిస్తున్నారు. దక్షిణం వైపుగల కోటిలింగాలను ముందుగా తరలించి, ప్రాకారాన్ని కూల్చివేస్తున్నారు. స్వామివారి అద్దాల మండపం తొలగింపు పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి.
News November 19, 2025
స్పోర్ట్స్ రౌండప్

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్లింపిక్స్లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ గోల్డ్ గెలిచాడు


