News March 20, 2025
పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ సమస్య రానియద్దు: వరంగల్ సీపీ

రేపటి నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సైతం ముందస్తు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేందుకు పోలీసులు తమ వంతు సహకారాన్ని అందజేయాలని సూచించారు
Similar News
News April 23, 2025
దొర్నిపాడులో 43.9°C ఉష్ణోగ్రత

నంద్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం జిల్లాలోని దొర్నిపాడులో 43.9°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News April 23, 2025
కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News April 23, 2025
ఈనెల 30న పాలిసెట్ పరీక్ష: DRO

ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DRO శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారని తెలిపారు. విజయనగరంలో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు, గజపతినగరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.