News March 23, 2025

పర్చూరుకు రానున్న సీఎం చంద్రబాబు

image

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నారు. చంద్రబాబు బాబు పర్యటన ఖరారు అయినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం సమావేశం నిర్వహించారు.

Similar News

News April 1, 2025

నారాయణపేట: సెంట్రల్ GOVT జాబ్ కొట్టాడు..!

image

నారాయణపేట మండల పరిధిలోని కందేన్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు బోయిని రఘువర్ధన్ ఇండియన్ నేవీ ఆర్మీ జాబ్ సాధించాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి జాబ్ సాధించాడు. నేవి జాబ్ సాధించిన రఘువర్ధన్‌కు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

News April 1, 2025

పాయింట్ల పట్టికలో అట్టడుగున డిఫెండింగ్ ఛాంపియన్స్

image

ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ నిరాశాజనక పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఇప్పటివరకు 3 మ్యాచులాడి రెండింట్లో ఓడింది, ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగున నిలిచింది. మరోవైపు ఆర్సీబీ టాప్‌లోనే కొనసాగుతోంది. ఆ తర్వాత DC, LSG, GT, PBKS, MI, CSK, SRH, RR ఉన్నాయి. కాగా ఇవాళ కేకేఆర్‌పై విజయంతో ముంబై ఆరో స్థానానికి దూసుకెళ్లడం విశేషం.

News April 1, 2025

నాగర్‌కర్నూల్: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. హీనంగా ప్రవర్తించారు..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శనివారం రాత్రి యువతిపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మైకంలో 8 మంది వివాహితపై విచక్షణారహితంగా అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి పశువుల కంటే హీనంగా ప్రవర్తించారనే ప్రచారం సాగుతోంది. పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.

error: Content is protected !!