News June 5, 2024

పర్చూరులో అభ్యర్థుల కంటే నోటా ఓట్లే అధికం

image

పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకంటే నోటాకు అధికంగా ఓట్లు లభించడం విశేషం. నియోజకవర్గంలో 15 మంది పోటీ చేయగా కేవలం ముగ్గురు మాత్రం 5 వేల కంటే అధికంగా ఓట్లు సాధించారు. నోటాకు 1289 ఓట్లు లభించాయి. మిగిలిన 12 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోల్ అవ్వడం గమనార్హం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే 5000 కంటే అధికంగా ఓట్లు వచ్చాయి.

Similar News

News October 6, 2024

ఒంగోలు: డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

image

డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి స్పాట్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఒంగోలులోని డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం ఈనెల 9లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా డిగ్రీ ప్రవేశాలు పొందని ఇంటర్ విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.

News October 6, 2024

పొదిలి: ఉప సర్పంచ్‌పై రాడ్లతో దాడి

image

ఉప సర్పంచ్‌పై రాళ్ల దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొదిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఓంకార్‌ని శనివారం అర్ధరాత్రి సమయంలో, తన ఇంటికి వెళ్ళే క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కాపుకాసి రాడ్లుతో తలమీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News October 5, 2024

ఒంగోలులో ఈనెల 8న మినీ జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధి సంస్థ, సీడప్ ఒంగోలువారి ఆధ్వర్యంలో అక్టోబరు 8న, ఒంగోలు ప్రభుత్వ బాలికల ITI కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.ITI, డిడిప్లొమా, టెన్త్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సం. నుంచి 30సం. లోపు మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని జిల్లా అధికారులు రవితేజ, భరద్వాజ్‌లు తెలియజేశారు.