News April 4, 2024

పర్చూరులో జెండా పాతేది ఎవరు.?

image

పర్చూరు నియోజకవర్గంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. ఏలూరి సాంబశివరావు 2014, 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో కేవలం 1647 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, మరోసారి పోటీచేస్తూ హ్యట్రిక్‌పై కన్నేశారు. అటు ఎడం బాలాజీ 2019 చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. మరోసారి చీరాల టికెట్ ఆశించగా కుదరక పర్చూరు నుంచి బరిలో ఉన్నారు. మొత్తం 2,25,770 ఓట్లలో మెజారిటీ ఓట్లు సాధించి ఎవరు గెలుస్తారో.?

Similar News

News April 22, 2025

ఒంగోలు: పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను చట్ట పరిధిలో ఉండడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 21, 2025

మార్కాపురం: ❤ PIC OF THE DAY

image

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ డ్రోన్ ఫొటో పలువురిని ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో భాగంగా డ్రోన్ కెమెరా ఈ ఫొటోను క్లిక్ మనిపించింది. పట్టణంలోని వివిద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న పట్టణ ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

News April 21, 2025

ఒంగోలు: అంగన్వాడీలకు ఐటీసీ కిట్స్

image

అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఐటీసీ వారు అందచేసిన అసెస్మెంట్ టూల్ కిట్, హబ్ అంగన్‌వాడీ మాడ్యూల్స్, పోస్టర్స్, బ్రోచర్స్, క్లాస్ మేనేజ్మెంట్ మెటీరియల్‌ను సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ మెటీరియల్‌ను జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!