News April 2, 2025

పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

image

బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరుగురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేతికి అందొచ్చిన కొడుకు చనిపోవడంతో వంశీ తల్లిదండ్రులు బోరున విలపించారు.

Similar News

News February 26, 2026

నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఒకరి మృతి?

image

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 26, 2026

ములుగు: నేటి నుంచి ఇంటర్ సెకెండియర్ పరీక్షలు

image

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 1860 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో 1632 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 228 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి.

News February 26, 2026

కర్నూలు: ఒకే ఒక్క పోస్టుకు నోటిఫికేషన్ విడుదల

image

కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. క్రిమినల్ లా ప్రాక్టీస్‌లో కనీసం 7 ఏళ్ల అనుభవం, సెషన్స్ కేసులు నిర్వహించిన వారు అర్హులన్నారు. మార్చి 10 నాటికి దరఖాస్తులు కార్యదర్శి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.