News April 2, 2025

పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్లాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వంశీ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 4, 2025

మార్కాపురంలో యువకుడు ఆత్మహత్య

image

మార్కాపురం కాలేజీ రోడ్డులోని జాకీ షోరూమ్ లో పనిచేస్తున్న మహేశ్ అనే యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన మహేశ్ జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం మార్కాపురం వచ్చాడని స్థానికులు తెలిపారు. నమ్మిన వారందరూ మోసం చేశారని జీవితం మీద విరక్తితో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 4, 2025

చీమకుర్తి : ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి జైలు 

image

చీమకుర్తి – గంగవరం రోడ్డు రచ్చమిట్ట సెంటర్ వద్ద 2019లో లారీ ఢీ కొని బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా లారీ నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడని నేర నిరూపణైంది. దీంతో ఎక్సైజ్ కోర్ట్ జడ్జి కోమలవల్లి నిందితుడికి 2 ఏళ్ల 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

News April 4, 2025

టంగుటూరులో కారు ఢీకొని ఒకరి మృతి

image

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సై‌కు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!