News September 21, 2024

పర్చూరు: ‘జాగ్రత్తగా లేకుంటే మరో బుడమేరు ప్రమాదం’

image

ఉప్పుటూరు గ్రామానికి పక్కనే ఉన్న వాగు వెంబడి కట్టలు తెగి ఉండడం పట్ల గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన తుఫాను కారణంగా కట్టలు తెగాయని అవి బాగుచేయకుంటే మరో బుడమేరు ప్రమాదాన్ని పర్చూరులో చూడాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కట్టలను బాగుచేయాలని వాగువెంబడే అనుకొని ఉన్న ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామవాసులు కోరుతున్నారు.

Similar News

News September 21, 2024

హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ, కలెక్టర్

image

ఒంగోలుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి యన్ వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కలెక్టర్ తమిమ్ అన్సారీయా, జిల్లా జడ్జీ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.

News September 21, 2024

ప్రకాశం జిల్లా వాసికి కష్టం.. సాయం చేసిన లోకేశ్

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7లక్షలు అందించారు. ఈ నేపథ్యంలో నాగరాజు కుటుంబ సభ్యులు ఉండవల్లి ప్రజాదర్బార్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

News September 21, 2024

ప్రకాశం: సీఎం చంద్రబాబుకు 53 వినతి పత్రాలు

image

నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం’జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు ప్రజల నుంచి 53 వినతి పత్రాలు స్వీకరించారని సంబంధిత అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. రెవిన్యూ సమస్యలపై 11, పెన్షన్ మంజూరుకు 8, వివిధ ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యసమస్యలపై 4, రోడ్లు అభివృద్ధి చేయాలని 12, ఇళ్ల మంజూరుకు 4, ఉద్యోగాల కోసం 11, విద్యుత్ సమస్యలపై 2 వినతులు వచ్చాయన్నారు.