News September 21, 2024

పర్చూరు: ‘జాగ్రత్తగా లేకుంటే మరో బుడమేరు ప్రమాదం’

image

ఉప్పుటూరు గ్రామానికి పక్కనే ఉన్న వాగు వెంబడి కట్టలు తెగి ఉండడం పట్ల గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన తుఫాను కారణంగా కట్టలు తెగాయని అవి బాగుచేయకుంటే మరో బుడమేరు ప్రమాదాన్ని పర్చూరులో చూడాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కట్టలను బాగుచేయాలని వాగువెంబడే అనుకొని ఉన్న ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామవాసులు కోరుతున్నారు.

Similar News

News October 14, 2024

ప్రకాశం జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా ప్రకాశం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఏవైనా సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టల్లోకి, సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News October 14, 2024

ప్రకాశం జిల్లాలో మద్యం లాటరీ ప్రక్రియ ప్రారంభం

image

ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో 2 కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ స్వయంగా లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం మొత్తం 3466 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో అధికారులు లాటరీ తీస్తున్నారు.

News October 14, 2024

ప్రకాశం: కారు బోల్తా.. ఇద్దరు మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. నలదలపూరులో జరిగిన వివాహానికి కొందరు హాజరయ్యారు. తిరిగి కారులో పోకూరుకు బయల్దేరారు. కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున కారు బోల్తాకొట్టింది. సామ్రాజ్యం(65), సులోచన(55) ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు, మిగిలిన వారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.