News February 1, 2025
పర్చూరు టీడీపీ నగర అధ్యక్షుడు మృతి

పర్చూరు TDP నగర అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన పర్చూరు MLA ఏలూరి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. TDPలో క్రియాశీలక వ్యక్తి అని పలువురు తెలిపారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని MLA ఏలూరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా వెంకటకృష్ణ సతీమణి శ్రీలక్ష్మీ నెలరోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నెల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News September 17, 2025
తిరుపతిలో బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి మృతి

తిరుపతి నగరంలో విషాదం నెలకొంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురంలో బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి చనిపోయాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్టీఫెన్గా గుర్తించారు. అంబేడ్కర్ లా కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది.
News September 17, 2025
విలీనం కాకపోతే TG మరో పాక్లా మారేది: బండి

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్ను మించి పరకాల, బైరాన్పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.
News September 17, 2025
నూతనకల్: సామన్య ప్రజలతో గడీపై దాడి

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నూతనకల్ మండలం ఎర్రపహాడ్కి చెందిన జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి దేశ్ ముఖ్ ఆధీనంలో లక్షా 50 వేల ఎకరాల భూమి ఉంది. ఎర్రపహాడ్లో సువిశాలమైన గడీలో రజాకార్లు ఉండటాన్ని పసిగట్టిన దాయం రాజిరెడ్డి, భీంరెడ్డి కొండల్ రెడ్డి దళాల నాయకత్వంలో ప్రజలను పోగుచేసి బాంబులతో గడీలపై దాడి చేశారు. ఇప్పటికీ ఆ గడీ అలానే ఉంది.