News April 6, 2024
పర్చూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యే లక్ష్మీపద్మావతి

పర్చూరు నియోజకవర్గంలో 1999 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆమె పర్చూరు నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి మహిళా మంత్రిగా మరో గుర్తింపు పొందారు.
Similar News
News February 25, 2026
2021లోనే నీళ్లు ఇచ్చేవాడిని: సీఎం

2019 – 24లో సీఎంగా ఉండుంటే 2021లోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్‌కు 4,35,000 ఎకరాల సాగుకు నీళ్లు వచ్చేవన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019 – 24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.
News February 25, 2026
ఆ సమయంలో ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారు: CM

30 ఏళ్ల కిందట మార్కాపురం వచ్చానని, ఆ సమయంలో మీరు కృష్ణా జలాలు ఇవ్వాలని కోరగా.. ఆనాడు హామీ ఇచ్చి, భూమి పూజ చేశాను అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వెలిగొండ పూర్తిచేసి జాతికి అంకితం చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని సీఎం తెలిపారు. 2014 – 19లో నేరుగా ప్రాజెక్టు దగ్గర వచ్చి పనులను పరిగెత్తించానని, కానీ 2019 – 24 చీకటి రోజులు రావడంతో పనులు ఆటకెక్కాయని చెప్పారు.
News February 25, 2026
వెలిగొండ పూర్తయితే 3 జిల్లాలకు ప్రయోజనం

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. 43.5 TMCల వరద నీటిని నల్లమల్లసాగర్ రిజర్వాయర్ ద్వారా మళ్లించి 19.2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2026కి పూర్తిచేస్తామని CM చంద్రబాబు పూనుకున్నారు.


