News April 6, 2024
పర్చూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యే లక్ష్మీపద్మావతి
పర్చూరు నియోజకవర్గంలో 1999 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆమె పర్చూరు నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి మహిళా మంత్రిగా మరో గుర్తింపు పొందారు.
Similar News
News January 20, 2025
త్రిపురాంతకం: బొలెరో బోల్తా.. 10 మంది కూలీలకు గాయాలు
త్రిపురాంతకం మండలం దీవెపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 20, 2025
ఖోఖో ప్రపంచ కప్‌లో ప్రకాశం కుర్రాడి సత్తా
ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
News January 20, 2025
సిమ్లాలో పర్యటించిన పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఎంపీ మాగుంట
గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ పర్యటనలో భాగంగా ఆ కమిటీ ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బృందం ఆదివారం సిమ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులు, వసతులపై స్థానిక ప్రజలతో ఆరా తీశారు. పలు అంశాలపై అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి త్వరలో నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.