News January 31, 2025
పర్చూరు: భార్య చనిపోయిన నెలకే భర్త మృతి

పర్చూరు గ్రామంలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. పర్చూరు 14వ వార్డు మెంబర్, టీడీపీ పర్చూరు పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల కృష్ణ శుక్రవారం హఠాన్మరణం చెందారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మృతి చెందినట్లు టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్ తెలిపారు. కాగా నెల క్రితమే కృష్ణ భార్య అనారోగ్య కారణంగా మృతి చెందింది. అగ్నిగుండాల కృష్ణ మృతితో పర్చూరు గ్రామంలో, టీడీపీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News November 17, 2025
హన్మకొండ: పైసా దేదో.. కామ్ ఖరో..!

హన్మకొండలో ఓ అధికారి లంచాల బాగోతం ముదిరిపోయింది. వివాదాస్పద స్థలాల కేసుల్లో అధికార నేతలతో కలిసి డబ్బులిస్తే చాలు వారికి అనుకూలంగా ఆర్డర్లను ఇస్తున్నారనేది బహిరంగంగా అందరికీ తెలిసింది. ఇటీవల HNK(M) సుబ్బయ్యపల్లి శివారులో సైతం 20ఎకరాల స్థలానికి సంబంధించిన కేసులో అనుకూలంగా ఆర్డర్ కోసం రూ.50లక్షల వరకు చేతులు మారినట్లు సమాచారం. దీంతో అవినీతి నిరోధక శాఖ మాత్రం చోద్యం చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News November 17, 2025
‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు కొత్త జీవితం

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు పశువైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో గౌరి అనే ఆవు కాలు కోల్పోయింది. దీంతో దానికి దేశీయంగా తయారు చేసిన ‘కృష్ణ లింబ్’ అనే కృత్రిమ కాలుని అమర్చారు. దీంతో అది మునుపటిలా నడుస్తోంది. డాక్టర్ తపేశ్ మాథుర్ దీన్ని రూపొందించారు. అవసరమైన జంతువుల యజమానులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు.
News November 17, 2025
HYD: ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారుల కొరడా

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 వాహనాలు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనచేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉప రవాణాశాఖాధికారి సదానందం ఆదేశాలపై చర్యలు కొనసాగిస్తున్నారు.


