News April 6, 2025
పర్చూరు: శ్రీరామ పట్టాభిషేకానికి 1818 నాటి రాగి నాణెం

బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులోని పురాతన కోదండరామ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ రఘు రామయ్య శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించి 1818లో ముద్రించిన రాగి నాణేలను ప్రదర్శించారు. ఆనాటి నాణేన్ని చూడడానికి ఆసక్తిగా గ్రామ ప్రజలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆలయంలో సందడినెలకొంది.
Similar News
News April 19, 2025
మెదక్: అగ్నివీర్ దరఖాస్తులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT
News April 19, 2025
జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జి

అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం గద్వాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వరుడికి రుద్రాభిషేకాలు అనంతరం జోగులాంబ అమ్మవారికి కుంకుమ అష్టోత్తర అర్చనలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
News April 19, 2025
శ్రీకాకుళం: చికిత్స పొందుతూ మహిళ మృతి

శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ గ్రామంలో జరిగిన వంటగ్యాస్ ప్రమాదంలో మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన జామి జయలక్ష్మి మార్చి 19వ తేదీన రాత్రి గ్యాస్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.