News April 6, 2025
పర్చూరు: శ్రీరామ పట్టాభిషేకానికి 1818 నాటి రాగి నాణెం

బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులోని పురాతన కోదండరామ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ రఘు రామయ్య శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించి 1818లో ముద్రించిన రాగి నాణేలను ప్రదర్శించారు. ఆనాటి నాణేన్ని చూడడానికి ఆసక్తిగా గ్రామ ప్రజలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆలయంలో సందడినెలకొంది.
Similar News
News April 25, 2025
పాలమూరు యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్!

పాలమూరు యూనివర్సిటీలో పీజీ కళాశాలలోని సంస్కార్ స్కూల్ ఉపాధ్యాయుల కోసం ప్రిన్సిపల్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఇంటర్వ్యూ ప్రక్రియను వివరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష అనంతరం డెమో, బోధనా సెషన్‌లు నిర్వహించారు. 20 మందికి పైగా విద్యార్థులు ఈ డ్రైవ్‌కు హాజరయ్యారు. దీంతో సంస్కార్‌ను ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి అభినందించారు.
News April 25, 2025
విజయవాడ: ఒకే జైలులో నలుగురు నిందితులు

విజయవాడ జిల్లా జైలులో కీలకమైన కేసులలో నిందితులుగా ఉన్న నలుగురు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ MLA వంశీ, జత్వాని కేసులో రిమాండ్ విధింపబడటంతో ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి PSR ఆంజనేయులు రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి, ఇదే కుంభకోణంలో A8గా ఉన్న చాణక్యకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పోలీసులు ఇదే జైలుకు తరలించారు.
News April 25, 2025
MBNR: బిల్డింగ్‌పై మృతదేహం కలకలం..!

ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన ఘటన MBNRజిల్లా అడ్డాకులలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామ వాసి షేక్‌బాలీ కుమారుడు ముస్తాక్(37) మద్యానికి బానిసై ఇంటికి రాకుండా కొన్నాళ్లుగా నిర్మాణంలోని ఓ బిల్డింగ్‌పై పడుకుంటున్నాడు. గురువారం ఓ కుక్క మనిషి చేతిని నోట కరుచుకుని రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు చూసి పోలీసులకు చెప్పారు. వారొచ్చి బిల్డింగ్‌పై చూడగా ముస్తాక్ శవం కుళ్లిపోయి కనిపించింది.