News November 28, 2024
పర్యవేక్షణ అధికారులపై చర్యలు తప్పవు: కర్నూలు డీఈవో
జిల్లా వ్యాప్తంగా FA మార్కుల నమోదులో జాప్యం చేస్తున్న పర్యవేక్షణ అధికారులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి సామ్యూల్ పాల్ హెచ్చరించారు. బుధవారం డీఈఓ కార్యాలయం నుంచి పర్యవేక్షణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 71% ప్రైవేట్ పాఠశాలలు 75%, ఎయిడెడ్ పాఠశాలలు 65%, కర్నూలు, ఆదోని, కోసిగి మండలాలు వెనక పడ్డాయన్నారు. 28వ తేదీ లోపు పూర్తి కావాలన్నారు.
Similar News
News November 28, 2024
మహిళతో అసభ్య ప్రవర్తన.. నంద్యాల వ్యక్తికి జైలు శిక్ష
నంద్యాలకు చెందిన ఎస్.కరీముల్లా అనే వ్యక్తి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల 1వ పట్టణ సీఐ జి.సుధాకర్ రెడ్డి తెలిపారు. నిందితుడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.
News November 27, 2024
తుగ్గలి: భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త
తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. సరోజ (35) అనే మహిళను భర్త గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మృతురాలు సరోజకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తుగ్గలి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News November 27, 2024
మంత్రి ఫరూక్ను సత్కరించిన న్యాయవాదులు
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను బుధవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎన్నికల సెల్ విభాగం న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. ప్రత్యేకించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కృషి చేస్తున్నారన్నారు.