News March 18, 2024
పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి: కలెక్టర్

సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ను ఆమె తనిఖీ చేశారు.
Similar News
News April 21, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.
News April 21, 2025
రాప్తాడులో నేడు ప్రజా దర్బార్: కలెక్టర్

రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మండలంలో సమస్యలు ఉన్న ప్రజలు ప్రజాదర్బార్లో ఆర్జీలు సమర్పించి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.