News September 18, 2024

పర్యాటక అవార్డులు కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక అవార్డులు పొందేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె మంగళవారం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. https://www.aptourism.gov.inలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 7, 2025

తూ.గో: గగనతలంలో ‘తూర్పు’ ఆశలు!

image

నేడు ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’. ఈ నేపథ్యంలో తూ.గో. వాసుల ఆకాంక్షలు బలంగా వినిపిస్తున్నాయి. మధురపూడి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలన్నది ప్రజల చిరకాల స్వప్నం. కడియం పూల గుబాళింపులు విదేశాలకు చేరేలా ‘కార్గో’ సేవలు విస్తరించాలని, గోదావరిపై సీప్లేన్ పర్యాటకం కొత్త పుంతలు తొక్కాలని కోరుతున్నారు. వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి విమానయాన రంగం ఊతమివ్వాలని ఆశిస్తున్నారు.

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.