News September 27, 2024

పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లా తీర్చిదిద్దుతాం: తుమ్మల

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని, ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కిల్లా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సెక్రటేరియట్లో పర్యాటక అభివృద్ధిపై, ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన రోప్ వే పనులపై తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ తో మంత్రి సమావేశమయ్యారు. ఖమ్మం ఖిల్లా పై రోప్ వే నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టాలన్నారు.

Similar News

News October 9, 2024

భద్రాద్రి: పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలను పెంచాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలోని నర్సరీలో పర్యావరణానికి,ఆయుర్వేదంగా ఉపయోగపడే మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మొక్కలను జిల్లాలోని అన్ని కెనాల్ రెండు వైపులా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో సైతం మొక్కలు పెంచాలన్నారు.

News October 9, 2024

అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. ”మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి” అంటూ ఆ ఫ్లెక్సీ పై రాసి ఉంది. అక్టోబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటామని ప్లెక్సీలో పేర్కొన్నారు.

News October 9, 2024

KMM: యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్సిరెడ్డి

image

ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం TSUTF ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో నిలపాలని TSUTF రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్చువల్ నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు.