News November 20, 2024

పర్యాటక ప్రాంతంగా రామతీర్థం..?

image

ఉత్తరాంధ్రలోనే అతి ప్రధాన దేవాలయంగా రామతీర్థం విరాజిల్లుతోంది. బోడికొండ, దుర్గా భైరవకొండ, గురు భక్తుల కొండలు ఇక్కడ ఉన్నాయి. పాండవులు, బౌద్ధులు సంచరించే ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనలో భాగంగా రామతీర్థం పేరును కలెక్టర్ అంబేద్కర్ ప్రకటించారు. తీర్థయాత్ర పర్యాటక ప్రాంతంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 6, 2026

VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

image

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్‌ఓ మురళీ, తదితరులున్నారు.

News March 5, 2026

VZM: మిషన్ హార్టీ విజన్‌తో ఉద్యాన సాగు విస్తరణ

image

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

News March 5, 2026

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

image

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.