News November 26, 2024
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: పవన్

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం మంగళగిరిలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పవన్ తెలిపారు.
Similar News
News September 19, 2025
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. మొత్తం మీద సగటు వర్షపాతం 4.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెదనందిపాడు మండలం 15.6 మి.మీ.తో అగ్రస్థానంలో ఉండగా, తుళ్లూరులో కేవలం 1.8 మి.మీ. మాత్రమే పడింది. మంగళగిరి 9.8, తాడికొండ 9.6, కాకుమాను 9.4, చేబ్రోలు 9.2, గుంటూరు పశ్చిమ 9.2, తాడేపల్లిలో 8.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు కొంత ఊరట పొందారు
News September 19, 2025
సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
News September 18, 2025
నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.