News November 26, 2024

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: పవన్

image

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం మంగళగిరిలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పవన్ తెలిపారు.

Similar News

News December 8, 2024

జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ సేవలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 

News December 8, 2024

LLB ప్రవేశాలకు 9న స్పాట్ అడ్మిషన్లు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించి ఈ నెల 9న సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. వివరాలను యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ పి.బ్రహ్మజీరావు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన వారు నేరుగా అడ్మిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. లా సెట్ రాయని వారికి కూడా ఈ ప్రవేశాల్లో అర్హులన్నారు.

News December 8, 2024

గుంటూరు: నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగాలు

image

నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. G.N.M, B.S.C నర్సింగ్ విద్యార్హత కలిగిన 35 ఏళ్ల లోపు వారు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శిక్షణ అనంతరం జర్మనీలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. https://forms.gle/K3He7nxcKE5HTacu8 లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనివివరించారు