News March 23, 2024
పర్వతగిరి: అబ్బురపరిచే మొరంగడ్డ
పర్వతగిరి మండలం తురకల సోమారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంటి పెరట్లో మొరంగడ్డ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా 5-8 అంగుళాల సైజు ఉండే ఈ మొరంగడ్డ ఏకంగా 2 అడుగుల పొడవు, రెండున్నర కిలోల బరువుతో అబ్బుర పరుస్తుంది. కాగా, గత కొంతకాలంగా వెంకటేశ్వర్లు తన ఇంటి ఆవరణలో కూరగాయలను పండిస్తున్నారు. వాటితో పాటు మొరంగడ్డ నాటారు. దానిని తవ్వి చూడగా.. భారీ పరిమాణంలో ఉండటంతో ఆశ్చర్యపోయారు.
Similar News
News September 13, 2024
ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి: కలెక్టర్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతోపాటు సుందరీకరణ చేపట్టడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ KUDA అధికారులను ఆదేశించారు.
News September 12, 2024
BREAKING.. BHPL: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన రవీందర్(35) రేగొండ నుంచి కొత్తపల్లికి బైకుపై వెళ్తుండగా భూపాలపల్లి నుంచి వస్తున్న RTC బస్సు ఢీకొట్టింది. దీంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 12, 2024
వర్గీకరణ అమలు అధ్యయన కమిటీలో సభ్యురాలిగా సీతక్క
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా ములుగు జిల్లాకు చెందిన సీతక్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.