News March 15, 2026
పర్షియన్ గల్ఫ్‌లో భారత యుద్ధ నౌకలు!

భారత నేవీకి చెందిన పలు యుద్ధ నౌకలను ఇరాన్‌కు సమీపంలోని పర్షియన్ గల్ఫ్‌లో మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా వైపు వచ్చే వాణిజ్య నౌకలకు అవసరమైతే సాయం అందించేందుకు అవి అక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి. మరోవైపు LPG గ్యాస్‌తో వస్తున్న రెండు భారత షిప్‌లు హార్ముజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. అందులోని శివాలిక్ ట్యాంకర్ ఈనెల 21న దేశానికి చేరుకోనుంది.
Similar News
News April 14, 2026
భద్రాద్రి: సెన్సస్ ప్రక్రియకు పక్కా ప్రణాళిక: కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో సెన్సస్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీఓ భారతి హోళీకేరికి వివరాలు వెల్లడించారు. సెన్సస్ ప్రతి దశను సమయపాలనతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. జనగణన ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
News April 14, 2026
సామాజిక సమానత్వానికి అంబేడ్కర్ కృషి అపారం: కేసీఆర్

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతికి అంబేడ్కర్ కృషిని వారు చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో విచక్షణారహిత సామాజిక సమానత్వం కోసం వర్ణ, కుల, మత, లింగ బేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు బాబా సాహెబ్ అని కేసీఆర్ అన్నారు.